Breaking blogs

0 0
Spread the love

హిడింబ హీరో నే విలన్ గా మారితే అనే ఆకట్టుకొని  యాక్షన్ థ్రిల్లర్

అశ్విన్ బాబు హీరోగా నటించిన సినిమా ‘హిడింబ’.  ప్రేక్షకులును ఈ సినిమా ఏ మాత్రం  మెప్పించదు  సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

ఆద్య (నందితా శ్వేతా) సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్. హైదరాబాద్ లో వరుసగా అమ్మాయిలు అదృశ్యం అవుతుంటారు. పదహారు మిస్సింగ్ కేసులు నమోదు కావడంతో ఇన్వెస్టిగేషన్ కోసం  ఆద్య కేరళ నుంచి వస్తోంది. అప్పటి వరకు అభయ్ (అశ్విన్ బాబు) కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. ఈ మిస్సింగ్ కేసుల విచారంలో అభయ్, ఆద్యకు తన సహకారాలు అందించడా ?, లేదా ?అనేది మిగిలిన కథ.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో మెయిన్ సీక్వెన్స్ లో వచ్చే కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా సాగుతూ ఆకట్టుకున్నాయి. ఇక అశ్విన్ బాబు, తన పాత్రలో అద్భుతంగా నటించాడు. సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన నందితా శ్వేత తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి.

మరో ముఖ్య పాత్రలో నటించిన మకరంద్ దేశ్‌పాండే కూడా చాలా బాగా నటించాడు. శ్రీనివాసరెడ్డి పంచ్ లు పర్వాలేదు. సంజయ్ స్వరూప్, రాజీవ్ కనకాల, షిజ్జు లతో సహా ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు.

సినిమాలో మెయిన్ పాయింట్ అండ్ కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా… మధ్యలో కొన్ని సీన్స్ మాత్రం బోర్ గా సాగుతాయి. అలాగే క్యారెక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూస్ ను ఎలివేట్ చేస్తూ దర్శకుడు అనిల్ కన్నెగంటి అనుకున్న సీన్స్ లో కొన్ని చోట్ల బెటర్ గా ఉన్నా… కొన్ని సీన్స్ మాత్రం ఆసక్తికరంగా సాగలేదు. అలాగే కొన్ని సన్నివేశాలు స్లోగా ఉండటం, మరియు కొన్ని సన్నివేశాల్లో ఇంట్రెస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

పైగా సెకండ్ హాఫ్ లో మెయిన్ ట్రాక్ లో లాజిక్ మిస్ అవ్వడం వంటి అంశాలు బాగాలేదు. ఓవరాల్ గా ఈ సినిమా స్క్రీన్ ప్లేను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే.. సినిమా ఇంకా బెటర్ గా ఉండేది.

సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సీన్ లోని మూడ్ ని తన కెమెరా యాంగిల్స్ తో కళ్ళకు కట్టినట్టు చూపించారు నేపథ్య సంగీతం కూడా బాగానే ఉంది. ఎడిటింగ్ కూడా బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నాయి. దర్శకుడు అనిల్ కన్నెగంటి మంచి పాయింట్ తీసుకున్నారు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆయన ప్లే ను రాసుకుని, సినిమాని తీసి ఉంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేది.

కొత్త పాయింట్ ను అంతే కొత్తగా చూపించలేకపోయారు. కొన్ని సన్నివేశాల్లో ఇంట్రెస్ట్ మిస్ కావడం, మరియు లాజిక్ లెస్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ .

ఈ సినిమా రేటింగ్ : 2/5.

మూవీ ట్రయిలర్

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *