Breaking blogs

0 0
Spread the love

ఉత్తర అమెరికా మరియు యు.కె.లో అడోర్(ఆరాధన) గా మరియు ఫ్రాన్స్ లో పర్ఫెక్ట్ మదర్స్ గా సినిమాకి పేర్లు పెట్టడం జరిగింది అన్నే ఫోంటైన్ దర్శకత్వం వహించిన 2013 నాటి డ్రామా మూవీ. ఇది ఫోంటైన్ యొక్క మొదటి ఆంగ్ల భాషా చిత్రం. ఇందులో నవోమి వాట్స్, రాబిన్ రైట్, బెన్ మెండెల్సన్, జేవియర్ శామ్యూల్, జేమ్స్ ఫ్రెచెవిల్లే నటించారు. జీవితాంతం స్నేహితులుగా ఉంటూ టీనేజ్ కొడుకులతో శృంగారంలో పాల్గొనే మధ్యవయస్కురాలైన ఓ జంట, వారి మధ్య జరుగుతున్న వ్యవహారాల వల్ల కలిగే భావోద్వేగ పరిణామాలే ఈ సినిమా కథాంశం.

ఇది 2003 లో బ్రిటిష్ రచయిత్రి డోరిస్ లెస్సింగ్ రాసిన ది గ్రాండ్ మదర్ అనే నవల ఆధారంగా రూపొందించబడింది.

ఈ చిత్రం 2013 సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దాని అసలు శీర్షికతో టూ మదర్స్ పేరుతో ప్రదర్శించబడింది.

Story

న్యూసౌత్ వేల్స్ లో చిన్ననాటి స్నేహితులు రోజ్, లిల్, వారి కుటుంబాలు పక్కపక్కనే ఉంటున్నాయి. రోజ్ కుమారుడు టామ్ మరియు లిల్ కుమారుడు ఇయాన్ కూడా మంచి స్నేహితులు, మరియు వారు నలుగురూ వారి సమయాన్ని కలిసి గడుపుతారు.

రోజ్ భర్త హెరాల్డ్ కు సిడ్నీలో ఉద్యోగం ఆఫర్ చేయబడుతుంది, రోజ్ వెళ్లడానికి ఇష్టపడనప్పటికీ ఏర్పాట్లు చేయడానికి అక్కడికి వెళ్తాడు. ఆ రాత్రి, ఇయాన్ రోజ్ ను ముద్దు పెట్టుకుంటాడు, మొదట ఆమె సంకోచించినప్పటికీ ఆమెకి అతని పట్ల ఆరాధన ఉండటం చేత వారిద్దరూ సెక్స్ లో పాల్గొంటారు. ఇయాన్ గది నుండి రోజ్ బయటకు రావడాన్ని టామ్  చూస్తాడు. అయోమయం మరియు నిరాశతో , టామ్ తనను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా  దూరంగా నెట్టివేసే లిల్ ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాడు  అతను తాను చూసినదాన్ని ఆమెకు చెబుతాడు. ఆమె కూడా మొదట ఈ విషయాన్ని నమ్మలేకపోతోంది కానీ టామ్ బలంగా చెప్పేసరికి  తెలియని అంతర్మాదంలో పడిపోతుంది  ఆ రాత్రి మళ్లీ ఆమె ఇంట్లోనే ఉండి శృంగారంలో పాల్గొంటాడు.

రోజ్ లిల్ పనిచేసే చోటికి వెళుతుంది  వారు వారి కుమారులతో ఏమి జరిగిందో చర్చిస్తారు. తామిద్దరం హద్దులు దాటామని, ఇకపై ఇలా జరగకూడదని వారు అంగీకరిస్తారు. అబ్బాయిలిద్దరితో కలిసి ఈ విషయాలకు ముగింపు పలకాలని చెబుతారు. కానీ  ఇయాన  ఇప్పటికీ రోజ్ పట్ల ప్రేమ ఆకర్షణ భావాలను బలంగా కలిగి ఉంటాడు   చివరికి, వారు సంబంధాన్ని తిరిగి కొనసాగిస్తారు; అలాగే లిల్ మరియు టామ్ తో కలిసి పడుకోవడం ఆపడం అసాధ్యమని తెలుసుకుంటుంది . లిల్ రోజ్ ఇద్దరు కలిసి వారు సంతోషంగా ఉన్నామని ఇది ఇలాగే కొనసాగించాలని ఇక ఎప్పటికీ ఆపడం కుదరదని వారు ఒకరికొకరు అంగీకారం తెలుపుకుంటారు   వారు కొనసాగడానికి అంగీకరిస్తారు. హెరాల్డ్ తిరిగి వచ్చినప్పుడు, రోజ్ తను తన బాబు ఇద్దరూ తనతో కలిసి సిడ్నికి రావట్లేదని చెప్పేస్తుంది

రెండు సంవత్సరాల తరువాత, రోజ్ మరియు హెరాల్డ్ విడాకులు తీసుకున్నారు, రోజ్ మరియు లిల్ వారి పిల్లలతో రహస్య వ్యవహారాలను కొనసాగించారు. ఇయాన్ ఇప్పుడు తన తల్లితో కలిసి ఒక పడవ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు, టామ్ నాటకరంగం లో  చదువుతున్నాడు. హెరాల్డ్ వారి నాటకాలలో ఒకదానికి దర్శకత్వం వహించడానికి టామ్ ను సిడ్నీకి ఆహ్వానిస్తాడు టామ్ అంగీకరించాడు, హెరాల్డ్  అతని కొత్త కుటుంబంతో కలిసి ఉంటాడు. సిడ్నీలో ఉన్నప్పుడు, అతను ప్రధాన పాత్ర కోసం ఆడిషన్ చేస్తున్న మేరీని కలుస్తాడు. ఇద్దరూ ఒక సంబంధాన్ని ప్రారంభిస్తారు, లిల్ అయిష్టంగానే టామ్ ముందుకు వెళ్ళాడని అంగీకరిస్తుంది. రోజ్ మరియు ఇయాన్ ఇప్పటికీ కలిసి ఉన్నారు, అయినప్పటికీ రోజ్  ఇయాన్ ఎక్కువ కాలం ఆకర్షణతో ఉండలేడని అనుకుంటుంది అందుకు  చివరకు అబ్బాయిలతో తమ వ్యవహారాలు ముగించడానికి తల్లులు అంగీకరిస్తారు. ఇయాన్ కలత చెంది బయటకు వచ్చేస్తాడు

కొంతకాలం తరువాత, టామ్ మేరీని వివాహం చేసుకుంటాడు. ఇయాన్ వివాహంలో హన్నా అనే అమ్మాయిని కలుస్తాడు రోజ్ దగ్గరికి తిరిగి వచ్చి ఆమెతో సెక్స్ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ రాత్రి, అతను రోజ్ తలుపు వద్దకు వచ్చి లోపలికి అనుమతించమని వేడుకుంటాడు, కాని రోజ్ అతనిని తిరస్కరిస్తుంది, ఆమె గదిలో నిశ్శబ్దంగా ఏడుస్తుంది. ఇయాన్ సర్ఫింగ్ కు వెళతాడు, కానీ ఈ ప్రక్రియలో కాలు విరిగిపోతుంది. అతను రోజ్ ను చూడటానికి నిరాకరిస్తాడు, కానీ హన్నా అతన్ని చూడడానికి వస్తుంది అతనికి శారీరక చికిత్స ద్వారా అతనికి నయం చేస్తుంది. వారు పెళ్లి చేసుకోకుండా ఒక సంబంధాన్ని ప్రారంభిస్తారు, ఒక రోజు, హన్నా ఇయాన్  చేసే దగ్గరికి వచ్చి, తాను గర్భవతి అని చెబుతుంది.

సంవత్సరాలు గడిచాయి, ఇప్పుడు ఇయాన్ మరియు టామ్ ఇద్దరూ వివాహం చేసుకున్నారు, మరియు వారిద్దరికీ కుమార్తెలు షిర్లీ మరియు ఆలిస్ ఉన్నారు. టామ్ మరియు ఇయాన్ భార్యలైన మేరీ మరియు హన్నాలకుభర్తలకు వారి వారి తల్లులతో ఉన్న అక్రమ బంధం గురించి ఈ వ్యవహారాల గురించి తెలియదు. వారంతా కలిసి బీచ్ లో ఒక రోజు గడుపుతారు, చాలా సమయం నీటిలో ఉండగా, ఇయాన్ మరియు రోజ్ నిశ్శబ్ద క్షణాన్ని పంచుకుంటారు. ఆ రాత్రి, వారంతా కలిసి భోజనం చేస్తారు, ఈ సమయంలో టామ్ తాగి దగ్గరికి వెళతాడు. ఇయాన్ అతన్ని అనుసరిస్తాడు   అతను లిల్ తో సెక్స్ చేయడాన్ని చూస్తాడు. కోపోద్రిక్తుడైన అతను మేరీకి నిజం చెబుతాడు. దీంతో భార్యలు భయపడి పిల్లలతో వెళ్లిపోతారు.


టామ్ తరువాత తిరిగి వచ్చినప్పుడు, రోజ్ తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉండటాన్ని అతను చూస్తాడు మరియు మేరీ, హన్నా వారి మనవరాళ్లు ఎప్పటికీ తిరిగి వస్తారని తాను అనుకోవడం లేదని ఆమె టామ్ కు చెబుతుంది. తాను టామ్ ఆపడానికి ప్రయత్నించామని, కానీ ఒకరికొకరు దూరంగా ఉండలేకపోయామని లిల్ కన్నీటితో నొక్కి చెబుతుంది. లిల్ గురించి రోజ్ కు మాటలు లేవు.

సమయం గడిచిపోతుంది, మరియు ఇయాన్ సముద్రంలో ఈత కొట్టడానికి వెళతాడు, అదే డాక్ వద్ద అతను మొదట రోజ్ తో తన సరసాలను ప్రారంభించాడు, రోజ్ మరియు లిల్ బాలికలుగా ఈత కొట్టేవారు. అతను డాక్ ఎక్కి టామ్, లిల్ మరియు రోజ్ అక్కడ ఉన్నట్లు చూస్తాడు. వారికి గుడ్ మార్నింగ్ చెప్పిన తరువాత, అతను రోజ్ పక్కన పడుకున్నాడు.

న్యూసౌత్ వేల్స్ లో చిత్రీకరణ జరిగింది. ఇళ్ళు మరియు ప్రధాన బీచ్ దృశ్యాలు సీల్ రాక్స్ వద్ద చిత్రీకరించబడ్డాయి, కొన్ని బీచ్ దృశ్యాలను షుగర్లాఫ్ పాయింట్ లైట్ హౌస్ బీచ్ లో చిత్రీకరించారు.  పాత్రలు పనిచేసే సన్నివేశాలను షెల్లీ బీచ్ లో, పబ్ సన్నివేశాలను బాల్మైన్ లో చిత్రీకరించారు. ఈ చిత్రంలోని కొన్ని భాగాలను కూడా సిడ్నీలో చిత్రీకరించారు.

movie trailer

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *